Ravindra Jadeja Could Be the future captain of Chennai super kings. Here's why.
#Chennaisuperkings
#Csk
#MsDhoni
#Ipl2022
#Ravindrajadeja
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను అంటిపెట్టుకుంది. అయితే ఈ రిటెన్షన్ ప్రక్రియలో ధోనీ కన్నా జడేజాకే సీఎస్‌కే యాజమాన్యం ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్‌గా జడేజాను రిటైన్ చేసుకోవడంతో అతనికి రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కగా.. ధోనీకి రూ.12 కోట్లే దక్కాయి. మొయిన్ అలీ రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌లకు రూ..6 కోట్లు చెల్లించనుంది. అయితే ధోనీని కాదని జడేజాకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది.